Chicken Fry : సన్‌డే అనగానే అందరికీ గుర్తు వచ్చేది చికెన్, మటన్, ఫిష్. కానీ చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. చికెన్ కర్రీ కంటే చాలామంది చికెన్ ఫ్రై నే ఎక్కువగా ఇష్ట పడతారు. చికెన్ ఫ్రై చేసేముందు కొద్దీ సేపు నాన పెట్టలి. ఇలా చేయటంవల్ల చికెన్ బాగా ఫ్రై అవుతుంది. చెకెన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వేపుడు కూరలో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ ఫ్రై ను రైస్ లో కానీ చపతిలో కానీ తినవచ్చు.
ఈ చికెన్ ఫ్రై ను రెస్టారెంట్ స్టైల్ లో మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.చికెన్ ఫ్రై కు కావలసిన పదార్ధాలు. హాఫ్ కేజీ చికెన్ ఒక కప్ ఆయిల్. 10పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా మూడు లవంగాలు. ఐదు దాల్చిన చెక్క రెండు యలుకులు ఆరు మిరియాలు ఉల్లిపాయలు రెండు. ధనియాలు మూడు టీ స్పూన్ లు, కస్తూరి మేతి కొంచం. మెంతులు ఒక టీ స్పూన్. తయారివిధానం ఇప్పుడు చూద్దాం.
Chicken Fry : చికెన్ ఫ్రై తయారివిధానం

స్టౌ పై పాన్ పెట్టుకొని అందులో రెండు మూడు లవంగాలు,నాలుగు ఐదు దాల్చిన చెక్క, రెండు తళుకులు కొద్దిగా ధనియాలు వేసి, లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా వేయించుకోవాలి. ఆ తరువాత ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం మెంతులు ఐదు మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఎండు మిర్చి కావాలంటే వేసుకోవచ్చు. అన్ని సరిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. వీటిని మిక్షీ లో మెత్తటి పోడర్ ల చేసుకోవాలి. అదే జర్లో పది పచ్చిమిర్చి వెయ్యాలి, ఆ తర్వత వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న అల్లం ముక్కలను కట్ చేసి వెయ్యాలి. వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చికెన్ బాగా కడిగి ఒక బౌల్ లోకి తీసుకొని ఇందులో చిటికెడు ఉప్పు కొంచం పసుపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మెత్తగా చేసిన పేస్టును వేసి కలుపుకోవాలి. చికెన్ ఫ్రై కు సరిపడా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని, పన్ లో ఒక కప్పు ఆయిల్ బాగా వేడి ఎక్కిన తర్వత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్ లో వేయించు కోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వత నాలుగు ఐదు కరివేపాకు రెబ్బలను వేసి కలుపకోవాలి.ఆ తర్వాత నాన పెట్టుకున్న చికెన్ ను లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. మూత ఉంచి వేయించు కోవటం వల్ల వాటర్ వస్తుంది.ఇలా వచ్చిన వాటర్ ఇంకి పోయేంత వరకు వేయించాలి. కొద్దిసేపటి తర్వాత నీరు అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఆ తరువాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి దానితో పాటు కస్తూరి మెతి వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించాలి. ఇలా ముక్కలు అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇలా చేసిన చికెన్ వేపుడు ఎనిమిది నుండి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేసుకోవచ్చు