మన నోట్లను అంధులు ఎలా చూడగలరో తెలుసా?

ప్రపంచంలోనే అంధులు మన నోట్లను చూడగలరు. అంధులకు మీరు 100, 200, 500, 2000 కలిపి ఇచ్చినా అది ఏ నోటో ఇట్టే చెప్పగలరు. మీరు డుబ్లికేట్ నోటును గుర్తించలేదు. మోసపోతారు. కానీ అంధులు అస్సలు మోసపోరు. మీరు ఓ నోటును ఇవ్వగానే అది జిరాక్స్ కాపీ అని ఖచ్చింతంగా చెప్పగలరు. మిషన్ కంటే ముందే వాళ్ళు చెప్పగలరు. మనకు సాధ్య పడనిది వాళ్ళకు ఎలా సాధ్య పడుతుంది? ప్రపంచంలోనే తొలిసారి ఇండియన్ గవర్నమెంట్ వాడిన ఈ కొత్త టేక్నాలజి ఏమిటిటో ఇప్పుడు తెలుసుకుందాము.

Advertisement

ఒక నోటు అనేది ఆ దేశం చరిత్రను, సమగ్రతను, జాతీయ వాదాన్ని తెలియజేస్తుంది. అలాగే మన దేశం కరెన్సీ నోట్లపై ఎన్నో రకాల సమాచారం ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్‌ సంతకం నుంచి వివిధ రకాల కోడ్స్‌, భాషలు, ఎన్నో రకాల సమాచారం ఉంటుంది. దీనితో పాటు నోట్లపై నాలుగు లైన్లు ఉంటాయి. అది ఎప్పుడైనా మీరు గమనించారా? అసలు ఆ లైన్స్ ఎందుకు ఉంటాయో అని మీకెప్పుడైన ఆలోచన వచ్చిందా? ఆ లైన్లు మనకోసం కాదు. అంధుల కోసం ప్రత్యేకంగా ముద్రించారు. అది కూడా మామూలు ఇంకు కాదు. కొన్నేళ్ళ పాటు వేలు స్పర్శకు తగిలే మందంతో అంటే స్పీడ్ బ్రేకర్ లాగా ఉండేలా అంధుల కోసం ప్రత్యక ఇంకు తో ముద్రిస్తారు.

Advertisement

ఎందుకంటే ఈ లైన్ లో టచ్ చేసి అది ఎంత నోటు అనే విషయాన్ని చెప్పదానికి. అయితే రూ.100, రూ. 200, రూ.500, రూ. 2000 నోట్లపై వేర్వేరు రకాల లైన్స్ ఉంటాయి. వంద రూపాయల నోటు రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. రూ. 200 నోటు కూడా అలాగే ఉంటుంది. అయితే దానికి రెండు సున్నాలను కూడా ఉంటాయి. ఇక రూ. 500 నోటు ఐదు గీతలు, రూ. 2000 నోటు 7 లైన్లు ఉంటాయి. అందులో ఈ గీతలు సహాయంతో నోటు విలువను అర్థం చేసుకుంటారని బ్యాంకు అధికారుల నుంచి సమాచారం.

Advertisement