రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె పేరు ఏంటో తెలుసా..?

రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తెకు బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే చిన్నారికి పేరు కూడా పెట్టేశారు. పాప పుట్టినప్పుడే పాపకు ఏం పేరు పెట్టాలో ముందుగానే డిసైడ్ చేశామని రామ్ చరణ్ ప్రకటించారు. దీంతో పాపకు ఏం పేరు ఫిక్స్ చేసి ఉంటారనే ఉత్కంట మెగా అభిమానుల్లో నెలకొంది.

Advertisement

ఈ క్రమంలోనే అందరి ఉత్కంటకు తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును ప్రకటించారు. ‘కిన్ కారా కొణిదెల ‘ అనే పేరు పెట్టినట్లు చెప్పారు. వినడానికి కొత్తగా అనిపిస్తున్నా ట్రెండీగా అనిపిస్తుంది. అయితే..సంప్రదాయబద్దంగానే పాపకు ఈ పేరును ఫిక్స్ చేశారు. శక్తివంతమైన అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం నుంచి ఈ పేరు తీసుకున్నారట. క్లిన్ కారా అంటే ప్రకృతి మరో రూపం అని అర్థం వస్తుంది.

Advertisement

అమ్మవారి దీవెనలు పాపకు అందేలా పేరు పెట్టిన అనంతరం ఉంగరం తొడిగినట్లు చెప్పారు చిరు. అమ్మవారి ఆశీస్సులతో పాప గొప్పగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. చిరు చేసిన ఈ ట్వీట్ కు అభిమానులు స్పందిస్తున్నారు. పాప పేరు కొత్తగా.. చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. పాపను ఊయలలో వేసి చిరంజీవి తెగ మురిసిపోతున్న ఫోటోను తెగ వైరల్ అవుతోంది.

Also Read : లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!!

Advertisement