గేమ్ స్టార్ట్ నౌ…కేసీఆర్ లో మొదలైన భయం..?

మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జూలై 2న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిపోకుండా ఉండేలా మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని భావిస్తోన్న కాంగ్రెస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

వాస్తవానికి పొంగులేటి బీజేపీలో చేరుతారని బీఆర్ఎస్ హైకమాండ్ అంచనా వేసింది. రాజకీయ పరిస్థితులు, ఆయనకున్న వ్యాపారం దృష్ట్యా ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్ళడని అనుకున్నారు కానీ అన్ని రాజకీయ అంశాలను పరిశీలించిన పొంగులేటి…బీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ మరింత బలీయంగా మారనుంది. బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లోనూ ఖమ్మం గుమ్మంలో మళ్ళీ ఎదురీతే ఎదురుకానుంది.

Advertisement

జూపల్లి కూడా బీజేపీ శిబిరంలో వాలిపోతారని అంచనా వేశారు కేసీఆర్. కానీ ఇప్పుడు కేసీఆర్ లెక్కలు తప్పాయి. ఈ ఒక్క పరిణామంతో బీజేపీలోని వలస నేతలు కూడా కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నారు. కీలక నేతలు కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్ళారు. చాలామంది నేతలు టికెట్ పై హామీ ఇస్తే బీజేపీ గోడ దూకి గాంధీ భవన్ మెట్లు ఎక్కేందుకు కాచ్చుకుచ్చున్నారు. ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరితే బీజేపీలో వలస నేతలు అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం మెండుగా ఉంది.

కేసీఆర్ అనాలోచిత నిర్ణయం..అంచనా వేయడంలో విఫలమై ఇప్పుడు బీఆర్ఎస్ కు కష్టాలు తెచ్చుకున్నాడు. ఫలితంగా కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తుండగా…బీజేపీలో పూర్తిగా నైరాశ్యం కనిపిస్తోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై ఆశలు మిణుకుమిణుకు అంటున్నాయి అప్పుడే. కాంగ్రెస్ ఇంకాస్తా గట్టిగా ఫోకస్ చేస్తే కర్ణాటక ఎన్నికల ఫలితమే ఇక్కడ రిపీట్ అవుతుందని… బీఆర్ఎస్ ను ఖంగుతినిపించడం ఖాయమని చెప్తున్నారు.

Also Read : ఆ ఐదుగురు మంత్రులకు నో టికెట్ – కేసీఆర్ సంచలన నిర్ణయం..?

Advertisement