Health tips : తెలగ పిండిని తినడం వలన కలిగే ప్రయోజనాలు.

Health tips : వేరుశనగ పప్పు నుండి నూనెను వేరు చేయగా మిగిలిన పిప్పి పదార్థాన్ని తెలగపిండి అంటారు. అత్యధిక ప్రోటీన్స్ కలిగిన తెలగపిండిని వాడటం వల్ల హార్మోన్ల ఉత్పత్తికి, ఎదుగుదలకి, కండపుష్టి కిఎంతగానో ఉపయోగపడుతుంది. ఎటువంటి కొలెస్ట్రాల్ లేనటువంటి ఈ తెలగపిండిని అధిక బరువు కలిగిన వారు కూడా ఆలోచించకుండా ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చు. హై ప్రోటీన్స్ కలిగిన ఈ తెలగపిండిని గర్భిణీ స్త్రీలు మరియు ప్రసవం జరిగిన స్త్రీలు ఆహారంలో దీన్ని తీసుకోవడం వలన బలహీనంగా ఉన్నవారు కూడా బలంగా,తయారవుతారు.
తెలగపిండి అలవాటు చేసుకోవడానికి దీనిని కేక్ లలో కూడా ఉపయోగించవచ్చు.కేక్ రూపంలో అయితే నోటికి రుచిగా ఉండటం వలన చిన్న పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరొనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య ఎక్కువ కరోనా సోకినవారిలో గెైఐసిన్ మరియు ఇమ్యూనిటీ తగ్గడంవల్లన చాలా బలహీనంగా ఉంటున్నారు. ఈ తెలగపిండిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన శరీరంలో ఇమ్యూనిటీ శక్తి బాగా పెరుగుతుంది. తెలగపిండిని అనేక విధాలుగా కూరలలో తీసుకోవచ్చు ఆకుకూరలతో, శనగపప్పుతో, వెల్లుల్లి ఇలా ఎన్నో విధాలుగా కూరలు చేసుకొని తీసుకోవచ్చు.తెలగపిండిలో డ్రైఫ్రూట్స్ వేసుకొని లడ్డూలు చేసుకుని తినడం వల్ల చిన్న పిల్లలకి, పెద్దలకి, ముసలివాళ్ళకి,అన్నిరకాల వయస్సు కలిగిన వారికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.సాధారణ ప్రజలు కూడా తక్కువ ఖర్చుతో ఈ తెలగపిండి వడియాలు చేసుకొని వడియాల రూపంలో తీసుకోవచ్చు.

Health tips : తెలగ పిండిని తినడం వలన కలిగే ప్రయోజనాలు.

Health Benefits of eating this flour
Health Benefits of eating this flour

తెలగపిండి తో ఎన్ని రకాలుగా కూరలు చేసుకోవచ్చునో తెలియని వారి కోసం, తెలగపిండి ఎండు రొయ్యల కూర, తెలగపిండి మునగాకు కూర, తెలగపిండి వెల్లుల్లి కూర, తెలగపిండి చికెన్ కూర, తెలగపిండి పప్పు, బీరకాయ తెలగపిండి కూర, తోట కూర తెలగ పిండి, ఫ్రాన్స్ తెలకపిండి కూర, ఇలా ఎన్నో రకాలుగా తెలగపిండి కూరను చేసుకొని తినొచ్చు. తెలగపిండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని చోట్ల దొరుకుతుంది.పట్టణాల్లో ఉన్న ప్రజలకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కూడా ఈ తెలగపిండి దొరుకుతుంది. తెలగపిండి లో ఖర్జూర పొడి, తేనె, నెయ్యి, బెల్లం కలుపుకొని తినొచ్చు, ఇలా చేస్తే చిన్న పిల్లలకి ఇష్టంగా అనిపిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నా ఈ తెలగపిండిని ఖచ్చితంగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులకీ రోజు అందించండి.