Health : పిల్లలు నుండి పెద్దల వరకు పానీ పారీ తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ రోజుల్లో ఇంటి ఫుడ్ కంటే బయట తయారు చేసిన ఫుడ్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే ఇటువంటి ఆహారపు అలవాట్లు వల్ల మీ ఆరోగ్యాని కి భంగం కలుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటి ఆహార ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. తోపుడు బండ్ల వెంబడి పానీ పూరి తినడం వల్ల ఎటువంటి దుష్పలితాలు కలుగుతాయో తెలుసుకుందాం వర్షా కాలంలో తోపుడుబండ్లపై పానీ పూరి తినవద్దని తెలంగాణ వైద్య శాఖ అధికారులు తెలియజేశారు.
ఇటువంటి పానీ పూరీ బండ్ల దగ్గర నుంచే టైఫాయిడ్ కేసులు నమోద అయితున్నాయని సూచించారు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పానీ పూరీ ప్రియులను హెచ్చరించడం జరిగింది. రైనీ సీజన్లో తోపుడుబండ్లపై పానీ పూరీని తినవద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ముప్పు ఉందని హెచ్చరించారు. టైఫాయిడ్ పానీ పూరీ డిసీజ్ గా మారిందన్నారు. పానీ పూరీ తోపుడు బండ్లు వారు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్తీ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులతో మరి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా వరసగా మూడు నాలుగు రోజులు పాటు జ్వరంతోబాధపడుతున్న వారు వెంటనే డాక్టర్ ని సంప్రదించగలరు అని డిహెచ్ వారు తెలియపరిచారు.
Health : అయితే మీరు అనారోగ్యానికి గురి అయినట్లే
మూడు రోజులు వర్షాల కారణంగా ఆహారం ,నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఇటువంటి సమయంలో వేడి వేడి ఆహార పదార్థాలు, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి. కలుషితమైన నీరు ,ఆహార పదార్థాల వల్ల విష జ్వరాల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వర్షం పడుతున్నప్పుడు అత్యంత అవసరం అయితేనే ఇంటి నుండి బయటకు రావాలని హెచ్చరించారు. కరోనా నుండి పూర్తిగా బయటపడ్డ… ఇప్పుడు వర్షాలు వల్ల వచ్చే వ్యాధులతో పోరాడాలని అన్నారు. ఇక కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని… అదేవిధంగా మాస్క్ మాత్రం పెట్టుకోవాలని సూచించారు. మాస్క్ పెట్టుకుంటే బ్యాక్టీరియా, వైరస్, సీజనల్ వ్యాధులు, విష జ్వరాల భారీ నుంచి బయటపడవచ్చు అని తెలియజేశారు