హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ బాయ్స్ ‘ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరో ‘ బొమ్మరిల్లు ‘ సినిమాతో టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ చాలామందికి సిద్ధార్థ అనగానే ముందుగా బొమ్మరిల్లు సినిమానే గుర్తొస్తుంది. అంతలా ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సిద్ధార్థ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్టును అందుకోలేదు.
దీంతో సిద్ధార్థ సినిమాలకు దూరం అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సిద్ధార్థ్ తెలుగులో చివరిగా నటించిన సినిమా ‘ మహాసముద్రం ‘ . ఆ సినిమా తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తీసుకున్న సిద్ధార్థ మళ్లీ త్వరలోనే ‘ చిత్తా ‘ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో సిద్ధార్థ బిజీగా ఉన్నారు. తాజాగా హైదరాబాదులో ఓ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అయితే సినిమా ఈవెంట్స్ లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్ గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి పలు ప్రశ్నలు అడగకముందే ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మీరు కాస్త పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని, మీకు చెప్పమని ఇంటర్నెట్లో నాకు సలహా ఇచ్చారని సిద్ధార్థ్ తెలిపారు. సురేష్ కొండేటి కి వార్నింగ్ ఇవ్వమని ఇంటర్నెట్ చెప్పిందని చెప్పారు. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు. అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను. సురేష్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా , అతనికి అడిగే రైట్స్ ఉన్నాయి అని చెప్పాను అని నవ్వుతూ సిద్ధార్థ సురేష్ కొండేటి తో మాట్లాడారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.