కాంగ్రెస్ కు షాక్ – బీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి..?

ఓ వైపు బీఆర్ఎస్ నేతలను రేవంత్ కాంగ్రెస్ గూటికి లాక్కొస్తుంటే…కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ లోని కీలక నేతలను కారెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని బీఆర్ఎస్ అధినేత ఫుల్ ఫోకస్ పెట్టారు. కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా స్తబ్దుగా ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ను వీడే ఆలోచనతోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్ళడంతో జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరిక లాంచనమేనని నమ్ముతున్నారు.

Advertisement

బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేరాలని ఆహ్వానించగా… పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం వెలువరిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు మంత్రి కేటీఆర్ సుముఖంగానే ఉన్నా…మరో మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న అభిప్రాయాలను బీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి నేతల మధ్య రాజకీయ వైరం ఉండటంతోనే జగ్గారెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై హరీష్ అనాసక్తి ప్రదర్శించారని అంటున్నారు.

Advertisement

బీఆర్ఎస్ అసంతృప్త నేతలపై కాంగ్రెస్ కన్నేయడంతో అందుకు దీటుగా చేరికలు ఉండాలని గులాబీ బాస్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. జగ్గారెడ్డితో బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్ళారని అన్ని అనుకూలిస్తే ఆయన త్వరలోనే బీఆర్ఎస్ లో చేరుతారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోసంగారెడ్డి కారు పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి బరిలో ఉండటం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి నాలుగు రోజుల్లో ఏం జరుగుతుందో..

Also Read : బీజేపీకి ఈటల , కోమటిరెడ్డిల గుడ్ బై ..? – ఇలా చెప్పేశారా..?

Advertisement