Lakshmi Manchu : స్వలింగ సంపర్కుల వివాహాలపై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు…..

Lakshmi Manchu : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చాలామంది డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కొంతమంది ఏకంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. కానీ వారు సహజీవనం చేసుకోవచ్చు అనే హక్కును కల్పించింది. అదేవిధంగా స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షత చూపించవద్దని పేర్కొంది.

Advertisement

manchu-lakshmis-sensational-comments-on-gay-marriage

Advertisement

వారి హక్కులను కాపాడాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తనని తీవ్ర నిరాశపరిచిందని తెలియజేసింది. స్వలింగ వివాహాలకు సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించకపోవడం దారుణం అంటూ ఆమె చెప్పుకొచ్చింది.అన్ని రకాల ప్రేమలను స్వీకరించి మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన నా దేశానికి ఇది నిజంగా అవమానం…ఇతర దేశాలలో ఎవరికివారు స్వేచ్ఛగా వారి జీవితాలను గడుపుతున్నారు.

manchu-lakshmis-sensational-comments-on-gay-marriage

కానీ మన దేశంలో స్వలింగ వివాహాలను అంగీకరించలేమా అంటూ మంచు లక్ష్మి ప్రశ్నించింది. దీంతో ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుపై మిశ్రమ స్పందన లభిస్తుంది. ఈ తీర్పు పై కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. మరి ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతున్నారు. ఎవరి జీవితాన్ని వారు స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. ప్రేమ గురించి ప్రపంచానికి బోధించే భారతదేశంలో స్వలింగ వివాహాలను సమర్ధించకపోవడం బాధాకరమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement