ఆ హీరోపై మనస్సుపడిన మీనా – అతను ఎవరో తెలుసా..?

టాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్ మీనాకు ఓ ప్రేమ కథ ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఓ హీరోను ప్రేమించాను. కానీ అప్పటికే అతనికి పెళ్లి అయిందని తెలుసుకొని బాధపడ్డానని వివరించింది మీనా. పెళ్ళంటూ చేసుకుంటే అతని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిందట. కానీ అసలు విషయం తెలిసి మనసుకు సర్దిచెప్పుకొని ఆ బాధ నుంచి మెల్లమెల్లగా బయటపడినట్లు చెప్పింది.

Advertisement

నవయుగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా… చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ, రజినీకాంత్ , కమల్ హసన్ వంటి స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా నటించింది. రెండు దశాబ్దాలపాటు అలరించిన మీనా…2009లో బెంగళూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకున్నారు. కెరీర్ పీక్స్ స్టేజ్ లో పెళ్లి చేసుకొని సినిమాలకు ఆమె దూరమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే గత ఏడాది జూన్ లో ఈమె భర్త మృతి చెందాడు. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి కోలుకుంటోంది మీనా.

Advertisement

ఇదిలా ఉండగా మీనా ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా ఆమె ఓ తమిళ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్ళికి ముందు ఒక హీరో అంటే క్రష్ ఉండేదని.. అతన్ని ప్రేమించానని, ఆ హీరోని పెళ్లి చేసుకుంటానని ఆమె అమ్మతో కూడా చెప్పిందట. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అని బయటపెట్టింది.

Also Read : విడాకులకు రెడీ అయిన యాదమరాజు – స్టెల్లా దంపతులు..?

Advertisement