Rashmi Goutham : యాంకర్ రష్మి మరోసారి నెట్టింట దుమారం లేపింది, “ఇండియాలో ఇదే పెద్ద దరిద్రమంట”!

Rashmi Goutham : బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన రష్మీ మీ తన బుల్లితెరపై బుల్లి తెరపై తిరుగులేని యాంకర్ గా నిలదొక్కుకుంది. తను చేసే షోస్ లో తనదైన స్టైల్ లో డాన్స్ తో తన అందాల ఆరబో తతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. టీవీలో ప్రసారమయ్యే ఢీ జోడి లో ఆది తో మరియు సుడిగాలి సుధీర్ తో చేసే కామెడీ చాలా హైలెట్గా నిలుస్తుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో తన ప్రేమాయణం గురించి తెలుగు ప్రేక్షకులకు చాలా క్యూరియాసిటీ ఏర్పడింది. ఆ విధంగా ఈ భామ తెలుగు బుల్లితెరపై బాగా పాపులర్ అయింది.

రష్మి గౌతమ్ బుల్లితెర పైనే కాక సినిమాలు కూడా చాలా చేసింది. గుంటూరు టాకీస్ సినిమా లో సువర్ణ గా రొమాంటిక్ క్యారెక్టర్లో చేసి యువకుల హృదయాలను కొల్లగొట్టింది. రాజు గారి బంగ్లా అనే సినిమాలో కూడా చేసి ఇ తనదైన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తరువాత అంతం, తను వచ్చెనంట, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి వంటి సినిమాల్లో చేసినా అంతగా వెండితెరపై ఈ భామకి ఫాలోయింగ్ రాలేదు. ఈ భామ బుల్లితెరపై మాత్రం తనదైన స్టైల్లో దూసుకుపోతుంది యువకుల మదిలో గూడు కట్టుకుంది. రష్మీ బుల్లితెరపై అంత ఘాటుగా నటించినప్పటికీ ఆమెకి జంతువులు అంటే చాలా ప్రేమ ఎక్కువ. పూర్వంలో లో లో జంతు ప్రేమని సోషల్ మీడియా ద్వారా తెలిపి తనకి జంతువులపై ఎంత ఉందో మన అందరికీ చెప్పింది.

Rashmi Goutham : యాంకర్ రష్మి మరోసారి నెట్ తింటా దుమారం లేపింది

Rasmi goutham shows her pet love once agina
Rasmi goutham shows her pet love once agina

జంతువుల పై ఎటువంటి చిన్న సంఘటన జరిగినా గాని ఈ భామ సోషల్ మీడియాలో చాలా గట్టిగా స్పందిస్తుంది. గత లాక్డౌన్ మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి అని తెలిసి తను స్వయంగా మూగజీవాల ఆకలి తీర్చింది. ఈ భామ ఎవరైనా మూగజీవాలు హింసించినా లేక ఏ చిన్న తప్పు చేసినా పెద్ద ఎత్తున స్పందిస్తూ వెంటనే ఆ సంఘటనను ఖండిస్తుంది. అయితే రష్మీ గౌతమ్ తాజాగా తన సోషల్ మీడియాలో ఆవుని తాడుతో కట్టి ఇంటికి వెళ్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది. జరిగిన ఈ ఉదంతాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓవైపు గోమాత అని పిలుస్తారు మరియు వాటిని తయారు చేసిన వస్తువులు వాడుతుంటారు అంటూ సోషల్ మీడియా ద్వారా తన అసహనాన్ని తెలిపింది. ఇండియాలో ఉన్న దరిద్రం అంటూ రష్మీ తన సోషల్ మీడియా ద్వారా రాసుకొచ్చింది. ప్రస్తుతం తన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.