గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్మన్‌గా సాయిచంద్ భార్య‌..!!

సాయిచంద్ హఠాన్మరణంతో రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ గా ఆయన భార్య వేద రజినిని నియమించారు. ఇటీవల గుండెపోటుతో సాయి చంద్ మరణించడంతో పార్టీకి సాయి చంద్ అందించిన సేవలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్…సాయిచంద్ నిర్వర్తించిన పదవిని ఆయన భార్య రజినికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

మరోవైపు.. సాయిచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇందుకోసం ఆ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

సాయిచంద్ వనపర్తి జిల్లా, అమరచింత గ్రామంలో 1984, సెప్టెంబరు 20న జన్మించాడు. వెంకటరాములు, మణెమ్మ దంపతుల సంతానమే సాయిచంద్. పదో తరగతి వరకు అమరచింతలో చదివిన సాయిచంద్.. ఆత్మకూరులో ఇంటర్ , హైదరాబాద్ లో డిగ్రీ, ఓయూలో పీజీ పూర్తి చేశాడు.

సాయిచంద్‌కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు. మరోవైపు.. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ గా సాయి చంద్ భార్య వేద రజినిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించడాన్ని హర్షిస్తున్నారు.

Also Read : బిగ్ న్యూస్ : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఝలక్..!!

Advertisement