ఫోక్ సింగర్ సాయి చంద్ మృతి..!!

తెలంగాణ ఉద్యమ సమయంలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా…నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా..తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా అంటూ అమరుల తల్లుల కడుపుకోతను పాటతో వినిపించిన ఉద్యమ గళం మూగబోయింది. ఒక్క పాట ఎంతోమందిని కదిలిచింది. తెలంగాణ వ్యతిరేకులను సైతం కంటతడి పెట్టించింది. ఉద్యమానికి మద్దతు తెలిపేలా చేసింది.

Advertisement

తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడిన సాయిచంద్ గుండెపోటుతో అకాల మృతి చెందారు. నాగర్ కర్నూల్ కారుకొండలోని ఫామ్ హౌజ్ లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

Advertisement

సాయిచంద్(39) విద్యార్ధి దశ నుంచే గాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలు ఉద్యమ స్పూర్తిని రగిల్చాయి. ఉద్యమంలో సాయి చంద్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు గిడ్డంగుల చైర్మన్ గా నియమించారు.కాగా ఆయన ఆకస్మిక మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మంత్రి హరీష్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్ళిన హరీష్… సాయి చంద్ ను అచేతనంగా ఉండటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement