Viral Video : సాధారణంగా ఎవరైనా చావు బతుకుల్లో ఉంటే చాలామంది వారిని కాపాడేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.మరి ముఖ్యంగా సిపిఆర్ చేయడం వలన చాలాసార్లు చాలామంది బ్రతకడం కూడా మనం చూసాం. అయితే ఈ సిపిఆర్ కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తుందని ,ఇలా చేయడం వలన మనసులు మాత్రమే బ్రతుకుతారని మనం అనుకుంటాం . కానీ అది నిజం కాదు. ప్రాణమున్న ప్రతి జీవికి సిపిఆర్ చేసి బ్రతికించవచ్చు. అయితే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా పాముకు సిపిఆర్ చేసి బతికించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే…
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను దారిలో వెళ్తుండగా ఒక పాము క్రిమిసంహారక మందును కలిపిన నీటిని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించాడు. ఈ క్రమంలోనే వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పాముకు సిపిఆర్ చేశాడు. పాము నోట్లో నోరు పెట్టి దానికి కృత్రిమ శ్వాస అందేలా చేశాడు. అయితే సిపిఆర్ ఎందుకు చేస్తారో మనందరికీ తెలుసు. ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఉండే కొట్టుకోకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో కృత్రిమంగా నోటి ద్వారా స్వాస అందించి ఆగిపోయిన గుండెను తిరిగి ఆక్టివేట్ అయ్యేలా చేసేదే సిపిఆర్. అయితే ఇలా చేయడం వలన చాలా సందర్భాలలో మనుషులు తిరిగి బ్రతికారు. అయితే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాత్రం పాముకు సిపిఆర్ చేశారు.
సిపిఆర్ చేసిన తర్వాత పాము కూడా స్పృహలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే పోలీస్ ఆ పామును పక్కనే వదిలేసి వచ్చినట్లుగా సమాచారం. ఇక ఈ వీడియోని చుట్టూ ఉన్న వారంతా వారికి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన నేటిజనులు సిపిఆర్ చేసి పామును బతికించడం అనేది చాలా గ్రేట్ అంటూ పోలీస్ ఆఫీసర్ ను ప్రశంసిస్తున్నారు. మరి కొందరు మాత్రం పాము నోట్లో నోరు పెడితే స్పృహలోకి రాగానే అది వెంటనే అతనినే కాటేస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు మంచిది కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతనిని మెచ్చుకుంటూ కొన్ని జాగ్రత్తలు తెలియజేశారు.
#MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr
— NDTV India (@ndtvindia) October 26, 2023