Popcorn : పాప్ కార్న్ చాలామంది థియేటర్లలో సినిమా చూస్తూ తింటుంటారు. మరికొందరు ప్రయాణంలో టైం పాస్ కోసం తింటారు. ఈ తేలికగా ఉండే పాప్ కార్న్ ఎవరైనా ఎక్కడైనా తినవచ్చు. పాప్ కార్న్ లో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందజేస్తాయి.
పాప్ కార్న్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బి, కాంప్లెక్స్, మంగనీష్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.
అయితే రోజు పాప్ కార్న్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందువల్ల పాప్ కార్న్ ను తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పరుస్తుంది. అదేవిధంగా రక్తంలో సుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. పాప్ కార్న్ లో ఉన్న ప్రోటీన్ మన శరీరానికి కావాల్సిన శక్తిని అందజేస్తుంది. కాబట్టి రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. పాప్ కార్న్ లో పాలి పినాల్స్ అని యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
Popcorn : పాప్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.

ఇవి వివిధ రకాల క్యాన్సర్లను దూరం చేస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బులను కూడా నయం చేస్తాయి. పాప్ కార్న్ లో ఎక్కువగా క్యాలరీలు ఉండవు. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునేవారు వీటిని డైట్ లో చేర్చుకోవచ్చు. వీటిని తక్కువ మొత్తంలో తీసుకున్న ఎక్కువ ఆహారం తిన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి త్వరగా ఆకలి వేయదు. కావున ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీనివలన బరువు ఈజీగా తగ్గగలరు. పాప్ కార్న్ ఫైబర్ ను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల రక్తనాళాలలో, ధమనులు గోడలు మధ్య పేరుకుపోయిన కొలెస్ట్రాలను తొలగింపబడుతుంది.
వీటిలో ఉండే ఫైబర్ రక్తనాళాలలో షు గర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. వయసు మీద పడడం వల్ల వచ్చే సమస్యలను ఛా యాలను, మచ్చలను, మా డిజైనరేషన్ వల్ల వచ్చే అంధత్వాన్ని , కండరాల బలహీనతను, జుట్టు సమస్యలను వీటన్నిటికీ చికిత్సగా పనిచేస్తుంది. వీటిలో ఉండే మంగనీష్ కండరాల, ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది