Breaking News : ఇప్పుడు గా ఉన్న తెలుగు తేజం అయినటువంటి వెంకయ్యనాయుడు ఇప్పుడు రాష్ట్రపతి రేస్లో ముందంజలో ఉన్నాడు అని చెప్పాలి. కేంద్రమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో వెంకయ్యనాయుడు భేటీ కావడం జరిగింది. ఈ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈ రోజు బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అభ్యర్థిని పార్లమెంటరీ సమావేశంలో ఖరారు చేయనున్నారు.
ఎప్పటి నుంచో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వీరు భేటీ వలన వెంకయ్యనాయుడు ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. అందుకే బిజెపి దిగ్గజాలైన జేపీ నడ్డా, అమిత్ షా, వెంకయ్య నాయుడు కలిశారు అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన యోగ డే లో మన ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు హడావుడిగా ఢిల్లీకి పయనం కావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.
Breaking News : రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు?

ఇంతే కాక ఒకవేళ వేరే ఒకరికి రాష్ట్రపతిగా అవకాశం ఇస్తే మళ్లీ ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడికి మరోసారి అవకాశం కల్పిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. అది ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలియవస్తుంది. వీటన్నిటి మీద ఒక క్లారిటీ రావటానికి అందరూ వేచి చూడక తప్పదు.