బిగ్ న్యూస్ : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఝలక్..!!

పరువు నష్టం కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురు అయింది. మోడీ ఇంటి పేరు కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ కు అక్కడ కూడా ఊరట లభించలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధిస్తు రాహుల్ పిటిషన్ ను కొట్టివేసింది. రాహుల్ నిర్దోషి అని చెప్పేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన ఈ కేసులో ఇక ఆఖరుగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది.

Advertisement

రాహుల్ పై కేసును హైకోర్టు కొట్టివేయకపోవడంతో ఆయనపై విదించిన అనర్హత వేటు కొనసాగుతోంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు ఉండదు. అయితే.. గుజరాత్ హైకోర్టు తీర్పు రాగానే కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. న్యాయస్థానాలను కేంద్రంలోని ప్రభుత్వం మేనేజ్ చేస్తోందని ఆరోపించారు.

Advertisement

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోంది? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన దోషి అని కోర్టు 2023 మార్చి 23న తీర్పు చెప్పింది, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

Also Read : Raghunandan rao- బీజేపీకి రఘునందన్ గుడ్ బై..? అసంతృప్తి వెళ్ళగక్కిన ఫైర్ బ్రాండ్..!!

Advertisement