Pawan Kalyan – Nara Lokesh : ఏపీలో పాదయాత్ర హడావుడి నడుస్తోంది. వాస్తవానికి ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా పలువురు నాయకులను ప్రజలను మెప్పించేందుకు, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రనే బెస్ట్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి షర్మిల కూడా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఏపీలోనూ ఇంకో రెండేళ్లలో ఎన్నికలు రానుండటంతో ఇప్పటి నుంచే పాదయాత్రల హడావుడి మొదలైంది.
నిజానికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఎక్కడ ముందస్తు ఎన్నికలు వస్తాయేమోనని పలు పార్టీల నేతలు ముందే పాదయాత్రకు ఫిక్స్ చేసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2018 లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే ముందస్తుకు వెళ్లారు. రెండో సారి అధికారంలోకి వచ్చారు. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే చాన్సెస్ ఉన్నాయని వార్తలు రావడంతో ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని, పాదయాత్ర చేయాలని టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచించారు.
Pawan Kalyan – Nara Lokesh : ముందస్తు లేకపోవడంతో పాదయాత్ర వాయిదా
అతి త్వరలో చిత్తూరు నుంచి పాదయాత్రను ప్రారంభించాలని.. ఉత్తరాంధ్రలో ముగించాలని నారా లోకేశ్ భావించారు. దాదాపు 450 రోజులు పాదయాత్ర చేయాలని అనుకున్నారు. అది కూడా ముందస్తు ఎన్నికలు వస్తే.. టీడీపీకి ప్లస్ అయ్యేలా తన పాదయాత్ర ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ.. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని క్లారిటీ రావడంతో లోకేశ్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారట. అలాగే.. పవన్ కళ్యాణ్ కూడా తన బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు. నిజానికి పవన్ బస్సు యాత్ర వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. కాలేదు. వాయిదా పడింది. ముందస్తు లేదని తెలియడంతోనే పవన్ కూడా తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి.. ఇద్దరు ఎప్పుడు పాదయాత్రను మళ్లీ మొదలుపెడతారో.