ఖబడ్దార్ పొంగులేటి – శవాలు కూడా దొరకవనే హెచ్చరికతో లేఖ..!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ తో కలిసి మీడియాతో మాట్లాడిన పొంగులేటి మంత్రి పువ్వాడపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొంగులేటి అనుచరులు కూడా పువ్వాడ లక్ష్యంగా పదునైన విమర్శలు చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే పొంగులేటితోపాటు ఆయన అనుచరులు లక్ష్యంగా పోస్టర్లు కనిపించడం కలకలం రేపింది. ఖబడ్దార్ పొంగులేటి అని రాసి పోస్టర్లను అతికించారు. పువ్వాడకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. మీడియాలో ప్రచారం కోసం దిగజారి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అజయ్ మీద కావాలనే మొరుగుతున్నారని మండిపడ్డారు.

Advertisement

పొంగులేటి అనుచరుడు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబుకు కూడా వార్నింగ్ లేఖ వచ్చింది. మంత్రి పువ్వాడ అజయ్ కాలు పట్టుకొని క్షమించమని ఆడగాలంటూ పేర్కొన్నారు. చీకటి కార్తీక్ పట్టిన గతి పడుతుందని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే శవాలు కొదొఆ దొరకవని రాసుకొచ్చారు.

Also Read : ఆ ఐదుగురు మంత్రులకు నో టికెట్ – కేసీఆర్ సంచలన నిర్ణయం..?

Advertisement