Raghurama Krishnam Raju : నాకు కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యం ఉంది. ప్రధాని మోదీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుతాను. నాకు అపాయింట్ మెంట్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. నాకు ఢిల్లీలో అంత పలుకుబడి ఉంది. వైఎస్ జగన్ కు నేను భయపడను.. అంటూ ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమంలో తనకు పిలుపే రాలేదు. అసలు.. ప్రోటోకాల్ జాబితాలో కూడా తన పేరు లేదు. పీఎంవో తన పేరునే చేర్చలేదు.

ఏపీ ప్రభుత్వం అంటే రఘురామను పట్టించుకోదు. ఎందుకంటే తను వైసీపీ నుంచి గెలిచినా కూడా రెబల్ ఎంపీ అయ్యారు. అలాగే.. వైఎస్ జగన్ తో తనకు చాలా రోజుల నుంచి వైరం ఉంది. అందుకనే బీజేపీతో కలిసి తిరుగుతున్నారు రఘురామ. ప్రధాని మోదీతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి.. ఎంపీగా రఘురామకు ఎందుకు పిలుపు రాలేదు అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Raghurama Krishnam Raju : వైఎస్ జగన్ ను బుట్టలో వేసుకోవడానికే రఘురామను పక్కకు నెట్టారా?
ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పాత్ర చాలా ముఖ్యం అయిపోయింది. అందుకే.. రఘురామను పీఎంవో పక్కన పెట్టిందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వైసీపీపై పోరుకు తనకు ఇన్నేళ్లు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుందని అనుకొని చెలరేగిపోయారు. కానీ.. ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా నీకు ఎలాంటి మద్దతు ఇచ్చేది లేదని కేంద్రం చెప్పకనే చెప్పింది. దీంతో రఘురామ ఏం చేస్తారు? సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి వెళ్లలేకపోయారు? వైసీపీని ఇప్పటి వరకు మాటలతో విమర్శించారు తప్పితే చేతల్లో చేసిందేమీ లేదు. సాక్షాత్తూ ప్రధాన మంత్రే వైసీపీని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇక రఘురామ మాట ఎందుకు వింటారు. మొత్తానికి రఘురామది ఉత్త మాటల వ్యవహారం తప్పితే చేతల్లో ఏమీ లేదని ఈ ఘటనతో తేటతెల్లం అయిపోయింది.