YS Vijayamma : ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రస్తుతం పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే.. ఇవాళ, రేపు వైసీపీ ప్లీనరీ జరగనుంది. ఆ ప్లీనరీకి వైఎస్ విజయమ్మ రారు అనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. దానికి కారణం.. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నారు అని తెలుస్తోంది. దీనిపై చాలా పత్రికలు కథనాలను రాశాయి. అయితే.. ఆమె కావాలని రాజీనామా చేయడం లేదని.. కావాలనే వైఎస్ జగన్ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఓ పత్రిక వెల్లడించింది.

వైఎస్ విజయమ్మ ప్రస్తుతం తన కూతురు వద్ద హైదరాబాద్ లోనే ఉంటున్నారని.. గత కొంత కాలంగా వైసీపీతో, సీఎం జగన్ తో పడటం లేదని అంటున్నారు. తెలంగాణలో తన కూతురు షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీ పార్టీ పైనే విజయమ్మ కూడా దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం, శనివారం జరిగే వైసీపీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ వస్తారా? రారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
YS Vijayamma : కొత్త పార్టీ పెట్టొద్దని వైఎస్ జగన్ తన చెల్లెలుకు సూచించారా?
నిజానికి.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టొద్దని వైఎస్ జగన్ తన చెల్లెలు షర్మిలకు సూచించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె తెలంగాణలో పార్టీని స్థాపించారు. తన పార్టీకి వైఎస్ విజయమ్మ కూడా మద్దతు పలికారు. అప్పటి నుంచి వైఎస్ విజయమ్మ, వైసీపీ పార్టీ మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. అటు అన్నాచెల్లెళ్లతో పాటు.. తన తల్లి విజయలక్ష్మితో కూడా జగన్ కు దూరం పెరిగినట్టు తెలుస్తోంది.
కట్ చేస్తే.. వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరు అయ్యే అవకాశాలు కూడా లేవంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్లీనరీలోనే వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. విజయమ్మతో బలవంతంగా సీఎం జగన్ బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని తెలుస్తోంది.
కాకపోతే.. తనే సొంతంగా రాజీనామా చేస్తున్నట్టు ఓ లేఖను సృష్టించి.. దాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీకి వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారు.