Social Media Platforms : సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా.. ఏదైనా వార్త తెలుసుకోవాలన్నా రేడియో, టీవీల మీద ఆధారపడేవాళ్లం. కానీ.. ఇప్పుడు టీవీ, రేడియో లాంటివేవీ అవసరం లేదు. ప్రపంచం నలుమూలన ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుంది. క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ఏదైనా పంచుకోవచ్చు. ఏదైనా మాట్లాడొచ్చు. అడిగేవాడు ఉండడు. మనకు నచ్చిన విషయాలను అందరితో షేర్ చేసుకోవచ్చు. అందుకే.. సోషల్ మీడియా ప్రస్తుతం రాజ్యమేలుతోంది.

అయితే.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో చాలా ఉన్నాయి. ఏది వాడాలి.. ఏది జెన్యూన్. ఏది పాపులర్ అనే విషయాలు చాలా మందికి తెలియదు. కానీ.. ఎక్కువ మంది వాడే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఏంటి? ఎక్కువ మంది యూజర్లు దేనికి ఉన్నారు. వాటి ప్రత్యేకత ఏంటి.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Social Media Platforms : టాప్ లో ఫేస్ బుక్
ఇటీవల సోషల్ మీడియా డేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం వల్ల.. మాషబుల్ అనే మీడియా బిజినెస్ ప్లాట్ ఫామ్.. పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఏవో సర్వే చేసింది. అందులో అందరూ అనుకున్నట్టుగానే ఫేస్ బుక్ టాప్ వన్ లో నిలిచింది. ఫేస్ బుక్ కు ఒక నెలలో 290 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారట. ఆ తర్వాత 220 కోట్ల మంత్లీ యాక్టివ్ యూజర్లతో యూట్యూబ్ సెకండ్ ప్లేస్ లో ఉంది.
ఆ తర్వాత 200 కోట్ల మంత్లీ యాక్టివ్ యూజర్లతో వాట్సప్ మూడో స్థానంలో, 200 కోట్ల మంత్లీ యాక్టివ్ యూజర్లతో ఇన్ స్టాగ్రామ్ నాలుగో స్థానం, 110 కోట్ల యూజర్లతో టిక్ టాక్ ఐదో స్థానం, 53.8 కోట్ల యూజర్లతో స్నాప్ చాట్ ఆరో స్థానం, 44.4 కోట్ల యూజర్లతో పింటరెస్ట్ ఏడో స్థానం, 43 కోట్ల యూజర్లతో రెడిట్ ఎనిమిదో స్థానం, 25 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో లింక్ డిన్ తొమ్మిదో స్థానం, 21.7 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లతో ట్విట్టర్ పదో స్థానంలో ఉంది.