Flipkart Big Billion Days 2022 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23న స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సేల్ ఈరోజుతో ముగియనుంది. అంటే సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకే అన్నమాట. దసరా, దీపావళి సందర్భంగా తీసుకొచ్చిన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందించారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, యాక్సెసరీస్ మీద భారీ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందించింది.

ఇప్పటికే ఈ సేల్ ప్రారంభం అయి వారం రోజులు అవుతోంది. ఇవాళ సేల్ చివరి రోజు కావడంతో కస్టమర్లకు మరిన్ని డిస్కౌంట్లను తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్. మొబైల్ ఫోన్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్, లాప్ టాప్స్, ఇతర గ్యాడ్జెట్స్ పై ఆఫర్లను అందిస్తోంది. చివరి రోజు సేల్ లో గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ ను కేవలం రూ.34,199 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఎంఆర్పీ ధర రూ.43,999 కాగా, దాదాపు 10 వేల రూపాయల డిస్కౌంట్ తో ఈ ఫోన్ ఈ సేల్ లో లభించనుంది.
Flipkart Big Billion Days 2022 : రూ.17 వేలకే రియల్ మీ 9 ప్రో 5జీ
ఈ సేల్ లో బడ్జెట్ ధరతో 5జీ ఫోన్ కావాలనుకుంటే రియల్ మీ 9 ప్రో 5జీ ఫోన్ నను రూ.16,999 కే పొందొచ్చు. దీని అసలు ధర రూ.21,999. రియల్ మీ 9 ప్రో.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్, 64 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉండనున్నాయి. ఇక.. పోకో ఎక్స్ 4 ప్రో 5జీ ఫోన్ ను ఈ సేల్ లో రూ.16,499 కే పొందొచ్చు. ఈ ఫోన్ ఎంఆర్పీ ధర రూ.23,999 కాగా.. ఈ సేల్ లో సుమారు రూ.8 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ, 6 జీబీ ర్యామ్, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫేసింగ్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. సామ్ సంగ్ గెలాక్సీ వాచ్ 4 ను రూ.10,999 కే పొందొచ్చు. గూగుల్ పిక్సెస్ బడ్స్ ఏ సిరీస్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ రూ.5999 కే పొందొచ్చు. ఎయిర్ పాడ్స్ ప్రో ను రూ.16,990 కే పొందొచ్చు. మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ సిరీస్ ఎస్ 512 జీబీ రూ.27,990 కే పొందొచ్చు. లెనొవో ఐడియాపాడ్ గేమింగ్ 3 15.6 ఇంచ్ లాప్ టాప్ ను కేవలం రూ.59,990 కే కొనుగోలు చేయొచ్చు. ఈ లాప్ టాప్ ఒరిజినల్ ధర రూ.95,090 గా ఉంది.