Nothing Phone 1 : నథింగ్ ఫోన్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచమంతా ప్రస్తుతం ఈ ఫోన్ గురించే వెయిట్ చేస్తోంది. ఐఫోన్ కు దీటుగా నథింగ్ అనే కంపెనీ నుంచి నథింగ్ ఫోన్ 1 అనే మోడల్ ఫోన్ ఇండియన్ టైమ్ ప్రకారం ఇవాళ రాత్రి 8.30 కు లాంచ్ కానుంది. ఈ ఫోన్ కోసం చాలా మంది టెక్ ప్రియులు తెగ ఎదురు చూస్తున్నారు. వన్ ప్లస్ కంపెనీ నుంచి బయటికి వచ్చిన ఆ కంపెనీ సీఈవో కార్ల్ పీ నథింగ్ కంపెనీని ఏర్పాటు చేసి.. ఒక సరికొత్త డిజైన్ తో నథింగ్ ఫోన్ ను తీసుకొస్తున్నాడు.

ఈ ఫోన్ డిజైన్, తదితర వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల అయ్యాయి. స్పెసిఫికేషన్స్ ను కంపెనీ అధికారికంగా విడుదల చేయనప్పటికీ.. నథింగ్ ఫోన్ 1 ఫీచర్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
Nothing Phone 1 : ఈ రోజు రాత్రి 9 నుంచి ప్రీ బుకింగ్స్ స్టార్ట్
ఇవాళ అంటే జులై 12 న రాత్రి 9 నుంచి ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. దాని కోసం ప్రీ ఆర్డర్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. రూ.2000 చెల్లించి ఫ్లిప్ కార్టులో ప్రీ ఆర్డర్ పాస్ తీసుకొని.. ప్రీ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Enough talk. Meet Phone (1) in 24 hours.#nothingevent.
12 July, 16:00 BST.
Watch online at https://t.co/pLWW07l8G7 pic.twitter.com/OznuriCP5K— Nothing (@nothing) July 11, 2022
ఇక.. సోషల్ మీడియాలో లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో విడుదల కానుంది. 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో ఉంది. 8 జీబీ వేరియంట్ ధర సుమారుగా రూ.39 వేల వరకు ఉండనుంది. 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర సుమారుగా రూ.41,250 గా ఉండనుంది. 12 జీబీ వేరియంట్ ధర సుమారుగా రూ.45 వేలు ఉండనున్నాట్టు తెలుస్తోంది.
Nothing Phone 1 Unboxing image leaked with transparent case.#NothingPhone1 #Flipkart #Nothingevent pic.twitter.com/pEXglBTdCi
— Mehran Pathan (@itsMehran333) July 11, 2022
ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేసే ఈ ఫోన్.. 6.55 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 778 జీ ప్లస్ ప్రాసెసర్, 50 ఎంపీ రేర్ కెమెరా, ఎల్ ఈడీ నోటిఫికేషన్ సిస్టం లాంటి ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.