Viral Video : సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు అలా చాలా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. కొన్ని ఫన్నీ వీడియోలు కావచ్చు.. మరికొన్ని జంతువులు వేటాడే వీడియోలు కావచ్చు. ఏవైనా సరే.. జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఓ కుక్క, తాబేలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా కుక్కలు ఇంట్లో పెంచుకుంటారు. పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ.. తాబేళ్లను ఎవరైనా పెంచుకుంటారా అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. తాబేళ్లను కూడా కొందరు పెట్ యానిమల్స్ లా పెంచుకుంటారు. కాకపోతే చాలా తక్కువ మంది ఇళ్లలో తాబేళ్లు కనిపిస్తాయి.
Viral Video : ఎంత ఫన్నీగా కొట్టుకున్నాయో?
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే.. కుక్క, తాబేలు రెండూ ఫన్నీగా ఫైట్ చేసుకునే వీడియో అది. మంచం కింద దాక్కున్న ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటం వీడియో అది. తాబేలు కుక్కను చూసి అరుస్తుండగా కుక్కకు కోపం వచ్చి తన తలను పట్టేసుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ ఎందుకో దాన్ని తలను వదిలేస్తుంది. ఏదో పట్టుకొని పట్టుకోనట్టుగా దాని తలను కుక్క పట్టేసుకుంటుంది. మళ్లీ తాబేలు అరవడం, కుక్క దాని తలను పట్టుకోవడం ఇలా పలుమార్లు కుక్క, తాబేలు మధ్య ఫన్నీగా పోరాటం సాగుతుంది. దానికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ ఆరిఫ్ షేక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
कछुआ भाईसाहब पक्के से @Nawazuddin_S भाईसाहब के फैन है, इसीलिए "मौत को छू कर टक से वापस आ रहे है" I pic.twitter.com/gfyMpGY9MV
— Arif Shaikh IPS (@arifhs1) September 24, 2022