Viral Video : మీకు చికినీ చమేలీ పాట గుర్తుందా? అగ్నిపథ్ సినిమా గుర్తుందా? బాలీవుడ్ లో 10 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో చికినీ చమేలీ అనే ఐటెమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కత్రీనా కైఫ్ వేసే డ్యాన్స్ ఆ పాటకే అందాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ ఆ సాంగ్ లో కత్రీనా వేసిన స్టెప్పులు వేయడానికి కష్టపడతారు కొందరు డ్యాన్సర్లు. ఆ సాంగ్ లో కత్రీనా అంతలా ఇరగదీసింది. హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా అది.

ముఖ్యంగా ఆ పాటతోనే ఆ సినిమాకు చాలా పేరొచ్చింది. ఆ సినిమా వచ్చిన తర్వాత ఏ ఫంక్షన్ లో చూసినా.. ఈ పాటకు డ్యాన్సులే. ఇప్పటికీ ఆ పాటకు డ్యాన్సులు వేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఆ పాటకు డ్యాన్సులు ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరు ఆ పాటకు డ్యాన్స్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Viral Video : తాజాగా యువతి వేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
తాజాగా చికినీ చమేలీ పాటకు ఓ యువతి డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. తను ఎక్కడ డ్యాన్స్ వేసిందో తెలిస్తే నోరెళ్లబెడతారు. క్లాస్ రూమ్ లో అందరు విద్యార్థుల ముందు ఆ పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. ఇక.. తను డ్యాన్స్ వేస్తుంటే తన తోటి క్లాస్ మెట్స్ అందరూ ఫోన్లు తీసుకొని తన డ్యాన్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ వీడియో చూసి అవాక్కవుతున్నారు. వామ్మో.. ఇదేం మాస్ డ్యాన్స్ రా బాబు. ఊర మాస్ స్టెప్పులేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.