Viral Video : ఈ ప్రపంచంలో దేనికి భయపడినా.. భయపడకపోయినా ప్రకృతి విపత్తులకు మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే.. ప్రకృతి విపత్తులు చెప్పి రావు.. అలాగే అవి వచ్చాయంటే ఇక మన పని అయిపోయినట్టే. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది భూకంపానికి సంబంధించిన వీడియో.

భూకంపం వస్తే అందులో వింతేముంది అంటారా? అక్కడే ఉంది అసలు తిరకాసు. ఓ వ్యక్తి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఇంట్లో నుంచి ఏదో శబ్దాలు వినిపించాయి. కొన్ని వస్తువులు కింద పడ్డాయి కూడా. వెంటనే భూకంపం వస్తుందని గ్రహించాడు. తన దగ్గరే ఉన్న కూతురును ఎత్తుకొని వేగంగా ఇంట్లో నుంచి పరిగెత్తాడు.
Viral Video : కూతురును పట్టుకొని భార్యను వదిలేయడంతో నెటిజన్లు షాక్
అంతవరకు బాగానే ఉంది. తన కూతురును పట్టుకొని భూకంపం ధాటి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి పరిగెత్తాడు ఆ వ్యక్తి. అయితే.. ఆ భార్య ఇంట్లోనే ఉన్న విషయాన్ని మరిచిపోయాడో లేక కావాలని వదిలేశాడో తెలియదు కానీ.. తన కూతురును మాత్రం తీసుకొని బయటికి పరిగెత్తాడు ఆ వ్యక్తి.
View this post on Instagram
బయటికి పరిగెత్తాక కొంత సేపటికి అతడి భార్య పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. ఆ తర్వాత తన ఇంట్లో భూకంపం ధాటికి వస్తువులు ఎలా చెల్లాచెదురు అయ్యాయో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తాజాగా తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ ఘటన 2018 లో జరిగింది. యూఎస్ లోని అలాస్కా స్టేట్ లో జరిగినట్టు తెలుస్తోంది. అయితే.. నెటిజన్లు ఆ వీడియో చూసి కావాలని భార్యను వదిలేశావా.. లేక తనను తీసుకెళ్లే సమయం లేక.. కూతురును తీసుకొని బయటికి పరిగెత్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.