Viral Video : అడవికే గజరాజు చాలా పెద్ద జంతువు. ఈ ప్రపంచంలోనే ఎక్కువ బరువు ఉండే జంతువు ఏనుగు. ఏనుగులు ఎంత శాంత జీవుల్లో వాటికి కోపం వస్తే అంత ఆగ్రహానికి లోనవుతాయి. వాటికి కోపం వస్తే ఏం కనిపించినా వదలవు. వాటికి కోపం వచ్చేలా చేస్తే అస్సలు ఊరుకోవు. అందుకే ఏనుగులను చూసి చాలామంది భయపడుతూ ఉంటారు.

కొందరైతే వాటి జోలికే పోరు. అడవికి రారాజు అయిన పులి, సింహం కూడా ఏనుగుల జోలికి పోవు. ఎంత పెద్ద సింహాన్ని అయినా ఒంటి చేత్తో అవతలకు విసిరేసే సత్తా ఏనుగులకు ఉంటుంది. ఏనుగులకు కోపం వస్తే వాటికి ఏది కనిపిస్తే అది నాశనమే. చివరకు ఇళ్లను కూడా అవి ధ్వంసం చేస్తాయి. రోడ్డు మీద ఏ వాహనం కనిపిస్తే ఆ వాహనం నుజ్జునుజ్జు కావాల్సిందే.
Viral Video : సోషల్ మీడియాలో వీడియో వైరల్
తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. అది తల్లి ఏనుగు, పిల్ల ఏనుగుకు సంబంధించిన వీడియో. తల్లి ఏనుగును ఆ పిల్ల ఏనుగు ఏదో అడిగింది. కానీ.. పిల్ల ఏనుగు మాటను తల్లి ఏనుగు బేఖాతరు చేయలేదు. పిల్ల ఏనుగును వదిలేసి దాని మాటను బేఖాతరు చేయకుండా వెళ్లబోయిన ఆ ఏనుగును చూసి పిల్ల ఏనుగు కింద పడి బొర్లింది. సాధారణంగా మనలో కూడా పిల్లలు ఏదైనా అడిగితే తల్లిదండ్రులు ఏదైనా ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఏడుస్తారు.. బ్లాక్ మెయిల్ చేస్తారు. అలాగే.. సేమ్ టు సేమ్ ఆ బేబీ ఏనుగు కూడా అలాగే తల్లి ఏనుగుపై అలిగింది. బుంగ మూతి పెట్టుకుంది. నేను రాను అని కింద పడి బొర్లింది. అయినా కూడా ఆ తల్లి ఏనుగు మాత్రం బేబీ ఏనుగు ట్రాప్ లో పడలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు మాత్రం నవ్వకుండా ఉండలేకపోతున్నారు.
Baby throwing tantrums on getting frustrated…
Relatable☺️☺️
VC:Fascinating pic.twitter.com/9YSvTCGTl9— Susanta Nanda IFS (@susantananda3) September 28, 2022










