Viral Video : సోషల్ మీడియాలో రోజూ ఎన్నో యాక్సిడెంట్స్ కు సంబంధించిన వీడియోలు చూస్తుంటాం. అయినా కూడా మనకు కనువిప్పు కలగదు. ఎందుకంటే రోడ్డు మీద అడుగుపెట్టగానే ఎవరికైనా స్పీడ్ గా వెళ్లాలని ఉంటుంది. ముఖ్యంగా బైక్స్, కార్ల మీద వెళ్లేవాళ్లు ఓవర్ స్పీడ్ గా వెళ్తుంటారు. తాజాగా ఓవర్ స్పీడ్ గా వెళ్లిన ఓ బైకర్ పరిస్థితి ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి. స్పీడ్ గా వెళ్లకండి అని ఎంత చెప్పినా ఎవ్వరూ వినరు కదా. ఎందుకు వింటారు. వింటే రోజూ ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ అవుతాయి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎందుకు ప్రమాదాలు జరుగుతాయి.
Viral Video : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అవగాహన వీడియో
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది హైదరాబాద్ లోని మియాపూర్ లో జరిగిన యాక్సిడెంట్ అది. ఓ ట్రక్ వేగంగా రోడ్డు మీది నుంచి దూసుకొస్తోంది. ఇంతలో ఓ బైకర్ ఫాస్ట్ గా రోడ్డు మీది నుంచి వెళ్తున్నారు. ఇంతలో ట్రక్ ను చూడకుండా బైకర్ వేగంగా వెళ్లడంతో బైకర్ ను ట్రక్ ఢీకొంటుంది. ఆ బైకర్ కు హెల్మెట్ లేకపోవడంతో అతడి తనకు గాయం అవుతుంది. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అందరికీ ట్రాఫిక్ అవగాహన కల్పించారు. ఆ వీడియోను చూసి అయినా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెబుతున్నారు. స్పీడ్ గా వెళ్తున్నారు అంటే.. మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అవగాహన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి నిజమే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.