Viral Video : రోడ్డుపై వెళ్తున్నామంటేనే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురి కావాల్సిందే. నడుచుకుంటూ వెళ్తున్నా.. వాహనాల మీద వెళ్తున్నా.. ఎలా వెళ్లినా రోడ్డు మీద అజాగ్రత్త పనికిరాదు. ముందూ వెనుకా చూసుకొని వెళ్లాలి. ఏమాత్రం అజాగ్రత్త చేసినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే బైక్ మీద వెళ్లేవాళ్లు హెల్మెట్ ధరించాలని చెబుతుంటారు. కార్లలో వెళ్లే వాళ్లు ఖచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు ఓవర్ స్పీడ్ గా నడపకూడదు. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తేనే ఇంటికి తిరిగి జాగ్రత్తగా వెళ్లగలం.

అయితే.. ఎక్కువ శాతం ఈ జనరేషన్ యూత్ వాహనాలను ఓవర్ స్పీడ్ గా నడిపి లేనిపోని సమస్యలు తీసుకొస్తుంటారు. అందుకే ఓవర్ స్పీడ్ గా వెళ్లొద్దని చెబుతుంటారు. రోడ్డు మీద ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఎదుటి వాళ్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.
Viral Video : ఓవర్ స్పీడ్ వల్ల రెండు కార్లు ఎలా ఢీకొన్నాయో చూడండి
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయా అని షాక్ అవుతున్నారు. అసలు ఏమైందంటే.. ఓ కారు ఒక రూట్ నుంచి ఇంకో రూట్ కు టర్న్ అవుతోంది. ఇంతలో ఆ రోడ్డు నుంచి మరో కారు ఓవర్ స్పీడ్ తో వస్తోంది. టర్న్ అవుతున్న కారును ఆ కారు డ్రైవర్ చూడలేదు. సడెన్ గా కారు దగ్గరికి వచ్చాక చూడటంతో ఓవర్ స్పీడ్ గా వస్తూ టర్న్ అయ్యే కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం మొత్తం చిత్తడి చిత్తడి అయింది. ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న కారు.. రోడ్డు కిందికి దిగి ఆగిపోయింది. వెంటనే వేరే వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులు వాళ్లను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్ స్పీడ్ గా వెళ్లడం ఎంత ప్రమాదమో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.