Viral Video : స్టంట్స్ చేయడం ఈరోజుల్లో ఒక సరదా అయిపోయింది. టైమ్ పాస్ అయిపోయింది. నిజానికి స్టంట్స్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి.. సాహసం చేయాలి.. కానీ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం.. లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి.

కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్ ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు అంటూ స్టంట్స్ అంటూ చేసి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.
Viral Video : బ్యాక్ ఫ్లిప్ చేయబోయి అడ్డంగా బుక్ అయిన యువతి
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఓ యువతికి సంబంధించిన వీడియో. ఆ యువతి సోషల్ మీడియా స్టార్. తన పేరు షాలు. తను ఒక జిమ్మాస్ట్. వాళ్లు ఎలాంటి విన్యాసాలు చేస్తారో తెలుసు కదా. ఆ యువతి చాలా విన్యాసాలు చేసి తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు.
సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నా కొద్దీ ఇంకా ఫేమస్ కావాలనిపిస్తుంది. ఇంకా స్టంట్స్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అదే తన కొంప ముంచింది. ఆ యువతిని సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ చేసింది. ఇంతకీ ఏమైంది అంటారా? ఆ యువతి చీర కట్టి.. స్కూటీ మీద నిలబడి మరీ బ్యాక్ ఫ్లిప్ ట్రై చేసింది. అంతా బాగానే ఉంది. బ్యాక్ ఫ్లిప్ కోసం ఎగిరింది. జంప్ చేసింది. కానీ.. చివరకు రోడ్డు మీద కింద పడిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ఎందుకమ్మా నీకు ఆ విన్యాసాలు.. అసలే రోడ్డు.. తలకు ఏదైనా గాయం అయితే ఏంటి పరిస్థితి అంటూ తనకు మొట్టికాయలు వేస్తున్నారు.
View this post on Instagram