మనిషి మేధస్సుకు, సైన్సు కి అందని పూరీ జగన్నాథ ఆలయం మహిమలు?

మన దేశంలో ఎన్నో గుడులు, గోపురాలు ఉన్నాయి. ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంది. దేని ప్రత్యేకత దానిదే. దేని మహిమ దానిదే. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది. పూరీ జగన్నాథ ఆలయం. ఈ గుడికి ఎన్నో మహిమలు ఉన్నాయి. అవి కొన్ని వేల ఏళ్లుగా మనిషి మేధస్సుకు, సైన్సు కి అందని మహిమలు. దానిని ఇప్పటికీ రుజువు చేసిన మానవ మాత్రుడు ఇంకా ఈ భూమ్మీద పుట్టలేదు. ఇక వివరాల్లోకి వెళ్ళితే –

Advertisement

పూరీ జగన్నాథ ఆలయం ఎక్కడ ఉన్నది?

Advertisement

పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం స్వర్గధామం. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.

జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయం కట్టబడింది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన “ఛార్ థాం” పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.

మహిమలు ఏమిటో తెలుసా?

పూరీ జగన్నాథ పై ఎగరేసే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అక్కడ చీరలు, జెండాలు ఆరబెతితే గాలికి రెపరెపలాడుతాయి. దీని సరిగ్గా వ్యతిరేక దశలో ఆలయం మీది జెండాలు రెపరెపలాడుతాయి. అంటే గాలికి ఎదురు తిరుగుతాయి. గాలికే విసనకర్ర లా ఊపుతాయి. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

రోజులో ఏ సమయంలోనైనా, ఏ కోణంలో చూసినా ఆలయం నీడ కనిపించదు. మనిషి, చెట్టు, కొండ, బండ, బిల్డింగ్ నీడనుంచి తప్పించుకోలేవు. కానీ ఈ ఒక్క ఆలయం మాత్రం తప్పించుకుంటుంది. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

ఈ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆ ఆలయం దరిదాపుల్లో ఏ పక్షి కూడా పొరపాటున కనిపించదు. పంజరంలో పక్షిని తీసుకెళ్ళి అక్కడ వదిలినా వెంటనే పారిపోతుంది. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

ఆలయం లోకి వెళ్లే సమయంలో దగ్గరలోని సముద్రం హ్రోరు వినిపిస్తుంది. కానీ ఆలయం నుంచి తిరిగి వెనక్కి వెళ్లే సమయంలో సముద్రపు హోరు వినిపిస్తుంది. ఆ ప్రాంతం పిన్ డ్రాప్ సైలెంట్ తో ఉంటుంది. కానీ ఆలయం లోకి వచ్చే వాళ్లకు అన్ని వినిపిస్తాయి. మరి తిరిగి వెళ్ళేటప్పుడు మంచి చెవులు ఎందుకు పని చేయవు? ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

గుడిలోని గుడిలో వంటగదిలో ఏడు కుండలపై ప్రసాదాలు వండుతారు. అన్నింటికంటే టాప్‌లో ఉండే ఏడో కుండలోని ఆహారమే ముందుగా ఉడుకుతుంది. దాన్ని దేవుడికి నివేదిస్తారు. ఈ రహస్యం ఎవరికీ అంతుపట్టదు. అన్ని ఒకసారి ఉడకవు. ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

ఈ దేవాలయంలోని విగ్రలను చెక్కతో నిర్మించారు. ఇప్పటివరకు అగ్ని ప్రమాదానికి గురికాలేదు. అసలు ఈ చెక్క మడదని, రాయిలా గట్టిగా ఉంటుంది అంటారు పూజారులు. మండని చెక్క ఈ భూమ్మీద లేదు. మరి ఇది ఎలా సాధ్యం? ఎందుకు? తెలియదు. ఏ సైంటిస్ట్ ఇప్పటికి రీజన్, లాజిక్ చెప్పలేకపోయాడు.

Advertisement