రష్మీని వదిలేసి ఆమెతో సుడిగాలి సుధీర్ పెళ్లి..?

జబర్దస్త్ కామెడి షో ద్వారా ఎంతోమందిని అలరించిన సుడిగాలి సుధీర్ పెళ్లి వార్త ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నానుతూనే ఉంటుంది. జబర్దస్త్ షో యాంకర్ రష్మీతో సుధీర్ ప్రేమాయణంలో ఉన్నారని వందలసార్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి లవ్ ట్రాక్ కు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. అందుకే వీరిద్దరి జోడిగా వచ్చిన స్కిట్లు సూపర్ హిట్ గా నిలిచాయి.

Advertisement

గతంలో ఈ జంటకు పెళ్లి కూడా జరిగిపోయిందనే వార్తలు సంచలనం అయ్యాయి. తమకు పెళ్లి జరిగినట్లు జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ వార్తలకు బ్రేక్ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే సుధీర్ కు మరదలు వరసయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. నిశ్చితార్ధం చేసుకుంటున్నట్లు ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి.

Advertisement

ఈ ఫోటోలను చూసిన రష్మీ- సుధీర్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. రష్మీని తమ సొంత వదినగా భావించామని..రష్మీని పెళ్లి చేసుకుంటారని అనుకున్నామని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి అనేది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలనేది వారి ఇష్టం. కానీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అభిమానులు ఒత్తిడి చేయకూడదు.

Also Read : అతను నన్ను వాడుకొని వదిలేసిండు – శ్రీముఖి షాకింగ్ కామెంట్స్

Advertisement