ఆల్ టైం రికార్డ్ – కిలో టమాటా రూ. 250

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొండెక్కి కూర్చున్నాయి అనుకుంటే ఉత్తరాదిన కూడా అదే తరహాలో ధరలు భగ్గుమంటున్నాయి.

ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ లో కిలో టమాటా రూ. 250గా ఉంది. ఇక ఉత్తరకాశీ జిల్లాలో కేజీ ధర రూ.180నుంచి 200వరకు ఉంది. అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా టమాటా ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. టమాటా ధరలు రూ. 200 దాటడంతో ప్రజలు టమాటా కొనేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. అంత మొత్తంలో వెచ్చించి టమాటా కొనే బదులుగా చికెన్ కొనడం ఉత్తతమని జనాలు మాంసాహారాన్ని కొంటున్నారు.

టమాటా దిగుబడి ప్రాంతాల్లో హీట్ వేవ్ కారణంగా పంట దిగుబడి ఘోరంగా పడిపోయిందని అంటున్నారు. అదే కాకుండా ఇటీవలి వర్షాలతో టమాటా పంటలు నాశనం కావడం కూడా ఓ కారణమని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలలోని బెంగళూరులో కేజీ టమాటా రూ. 100 నుంచి 120 మధ్యలో ఉంది. హైదరాబాద్, చెన్నైలో రూ. 100 నుంచి 130 మధ్యలో ఉంది.

Also Read : Sravana masam- శ్రావణమాసంలో ఈ మొక్కలు నాటితే లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందుతారు