నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు.
దర్శకులు : కార్తీక్ దండు
సంగీత దర్శకులు: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్
‘విరూపాక్ష’ గొప్ప మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇది సాయి ధరమ్ తేజ్ ముందుండి నడిపిన సినిమా. రచయిత, దర్శకుడు కార్తీక్ దండు రాసిన గొప్ప కథ. ఫార్ముల కథల నుంచి బయటపడి కొత్తగా ఆలోచించాడు. లోగడ టి కృష్ణ తీసే సినిమాలాగా ఇందులో ఒక సామాజిక స్పృహతో పాటు కమర్షియల్ ఎలిమెంట్ లు కూడా ఉన్నాయి. మంచి మెసేజ్ ఇస్తూనే ప్రేక్షకుడ్ని ఎంటర్ టైన్మెంట్ చేయడం చాలా కష్టం. కానీ దర్శకుడు ఈ విషయంలో దాదాపు విజయం సాదించాడు. ఒక మంచి సినిమా అనడం కంటే గొప్ప సినిమా అంటే బాగుంటుంది. దర్శకుడు కార్తీక్ రాసిన కథ, హారర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే టేకింగ్ సినిమాలో ఆకట్టుకున్నాయి.
కథ ఏమిటంటే?
చాలా కొత్త కథ. మంచి కథ. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న మూడనమ్మకాలను ఎత్తి చూపుతూ, అది ఎంత ముర్కత్వామో దర్శకుడు సున్నితంగా, తెలివిగా చెప్పాడు. రుద్రవనం అనే ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఒక కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు చంపేస్తారు. ఆ జంట కుమారుడ్ని ఆ ఊరు నుంచి పంపించేస్తారు. ఇది జరిగిన పుష్కర కాలం తర్వాత సూర్య (సాయి ధరమ్ తేజ్) తన తల్లితో పాటు రుద్రవనం ఊరు వస్తాడు.
రుద్రవనం తన తల్లి ఊరు కావడంతో ఆ ఊరుతో సూర్యకి ఎనలేని బంధం ఉంటుంది. దీనికి తోడుగా నందిని (సంయుక్త మీనన్)తో సూర్య, ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందటం కోసం సూర్య ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవైపు ప్రేమ కథతో పాటు మరోవైపు ఆ ఊరులో మనుషులు చనిపోతూ ఉంటారు. దాంతో ఆ ఊరు మొత్తం భయంతో వణికపోతుంది. మనుషులు అసలు ఎందుకు చనిపోతున్నారు? వారి చావుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ రహస్యాలను సూర్య ఎలా పరిష్కరించాడు ? చివరకు ఏం జరిగింది? అన్నది వెండి తెరమీద చూసి ఎంజాయ్ చేయవలసిందే.
ప్లస్ పాయింట్ లు ఏమిటంటే
ఈ సినిమాకు హీరో కథ. విషయం పాతదే అయ్యినా కథ కొత్తగా అల్లుకోవడంతో చూడ ముచ్చటగా ఉంది. ప్రతి షాట్ అందంగా ఉన్నది. దీనికి కెమెరామెన్ శామ్‌దత్ సైనుద్దీన్ ఎంత మెచ్చుకున్నా తక్కువే. అతను స్కీన్కి తగ్గట్టు లైటింగ్ పెట్టాడు. ముఖ్యంగా హారర్ షార్ట్ లు చక్కగా తీసాడు. దీనికి తగ్గటు సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ తన క్రియేటివీటిని చూపాడు.
ఇక అంతా తానై నడిపాడు హీరో సాయి ధరమ్ తేజ్. అతని నటనలో చాలా పరిపక్వత వచ్చింది. ప్రతి డైలాగ్ని ఫీల్ అవుతూ చెప్పాడు. ఎక్కడా నటించలేదు. జీవించాడు. చిరంజీవికి 70 సినిమాల తరువాత వచ్చిన పరిపక్వత సాయి కి ఈ సినిమాకే వచ్చేసింది. కాబట్టి చిరంజీవిలా చాలా పరిపక్వతతో నటించాడు. ఇక నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. ప్రతి షాట్ రిచ్ గా రావాలని డబ్బు గుమ్మరించారు. ఇది ఓ ఉత్తమ నిర్మాత లక్షణం. ఇది నిర్మాత సినిమా.
మైనస్ పాయింట్ లు ఏమిటంటే
కార్తీక్ దండు కథను బాగా రాసుకున్నప్పటికీ దర్శకుడిగా కొన్ని సీన్లు చాలా స్లో నరేషన్ లో తీసాడు. హారర్ సినిమా, క్రైమ్ సినిమాలల్లో సస్పెన్స్ మేంటైన్ చేయడానికి డీటెయిల్ గా చెప్పాలి. మరీ ఇంత డీటెయిల్ అవసరమా? ‘మంగా టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉంది?’ అని అడిగే వాడికి టి తాగించి మరి అడ్రెస్స్ చెప్పాలా?
ఇక నటినటుల విషయానికి వస్తే రాజీవ్ కనకాల పాత్ర ఎంత గొప్పదో – అతని ఆక్షన్ అంత చెత్తగా ఉన్నది. ఈ మధ్య బాగా లావేక్కాడు. ముఖం గండు పిల్లిలా మారింది. హావ భావాలు కనిపించాలి అని స్టేజి నాటకంలో లాగా అతిగా నటించాడు. అతిగా నటించడంతో స్టేట్ మీద నాటకం చసిన చిరాకు కలిగింది. ప్రేక్షకులు ఆసనానికి గురయ్యారు. నటన, డైలాగ్ డెలివరి ఆర్టి ఫిషియాల్ గా, నీచంగా ఉంది. ఇలాంటి మంచి పాత్రలకు వెన్నెల కిషోర్ లాంటి మెచ్యూర్ నటుడు ఉంటే క్యారెక్టర్ పండేది.
హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సినిమాకు మైనస్ అనే చెప్పాలి. ఆమె ఆక్షన్ బాగా చేసినప్పటికీ గ్లామర్ లేదు. అందం అంతంత మాత్రమే. నెగిటివ్ పేస్. అంటే కన్నింగ్ పాత్రలకు బాగానే ఉంటుంది. కానీ రొమాన్స్ సీన్స్ కి అస్సలు సూత కాలేదు. అందుకే కొన్ని రొమాంటిక్ సీన్లు పండలేదు.
రేటింగ్ ; మొత్తం 5 పాయింట్ లకు మేము ఇచ్చే పాయింట్లు ౩.50 మాత్రమే.